Alexander Hay (Alex)
Alexander Hay
 • 27
  |
 • 18
  |
 • 0
  |
 • 5
  |
 • 612
A.Sridhar ayalasomayagula

భావనాతీత గమ్యము. 

‘భాస్కర్ ఉదయాద్రి’ ఆగర్భ శ్రీమంతుడు, తండ్రి మిగిల్చిన ‘పెట్రో కెమికల్’ కంపెనీకి  యజమాని! అంతే కాక,అందగాడు,ధనవంతుడు,రసికాగ్రేసరుడు అయిన అతను, ఒక అమ్మాయిని ఇష్టపడి రహస్యంగా పెళ్లి చేసుకొన్నాడు!ఆ పెళ్లిని తల్లి అంగీక రించ లేదు,ఆమెతో తెగతెంపులు చేసుకోమని చెప్పి,రమా పద్మజ’ అనే చక్కని చుక్కని ఎంపిక చేసి,అతనితో వివాహం చేసింది! ఆతరువాత తనువు చాలించింది.

వివాహం అయిన 2 పెళ్లి రోజులకి అతను ఊర్లోనే లేడు! 3 వ వార్షికోత్సవం రాబో తోంది. ‘రమా పద్మజ’ ఆ రోజుని భర్తతో కలసి వేడుకగా జరుపుకోవాలని సహజం గానే తహతహ లాడింది! భర్తని ఆ నాడు మాత్రం ఎక్కడికీ వెళ్లవద్దని బ్రతిమాలింది. భాస్కర్’ ఉదయాద్రి ఆమెకి స్పష్టంగా మాట ఇవ్వక పోయినా,“సరే రమా! నాకు మాత్రం అప్సరసలని తలదన్నే భార్యతో, వేడుకగా గడపాలని ఉండదేమిటి! మన 3వ ఏనివర్సరీని ‘భావనాతీతంగా’ జరుపుకొందాం,సరేనా!” అంటూ ఆమె చెక్కిలిని ముద్దాడాడు.

‘రమా పద్మజ’ మురిసి పోయింది! ఆమెకి  శోభనం నాటి రాత్రి  శ్రీవారి ముచ్చట్లు గుర్తుకి వచ్చాయి!ఆ పులకింతలతో  మదన తాపానికి గురయిన ఆమె తనులతకి చెమటలు పట్టి ఉరోజబంధాలు,కటిబంధాలు తడిసి పోయాయి! తడిసిన వలువలు విప్పివేసి నగ్నంగానే, ఆమె స్నానాల గదికి పరుగు పెట్టి,శరీరానికి చందన లేపనం

చేసుకొని,గోరు వెచ్చని జలకాలలో స్నానం చేస్తూ ఉపశమనం పొందింది.

‘భాస్కర్ ఉదయాద్రి’ ఆఫీసుకి బయలు దేరాడు కాని, అతని మనసు కారుచక్రాల లాగే ‘రమా పద్మజ’ పరువాల చుట్టూ పరిభ్రమించ సాగింది.  

నిండు పున్నమి చందమామ లాంటి గుండ్రని ముఖం,అర్థచంద్రుని లాగ బయటికి ఉబికి వచ్చి తేజస్సు వెదజల్లువిశాలఫాలభాగం, నల్లని పుష్కలావర్త మేఘాల లాంటి, ఘనముదీర్ఘము అయినకేశరాశి, విల్లులాగవంచి తీర్చిదిద్దినట్లుఉండే కనుబొమలు,పుండరీకదళాల లాంటి వెడల్పు ఆర్ద్రత కలిగిమిసమిస లాడే ఆకర్షక కేంద్రాల లాంటి కళ్ళు, పెట్లుకొన్న బంగారునత్తుని గర్వంగాప్రదర్శిస్తూ నిటారుగానిలబడిననాసిక,శంకరాభరణం జుంకాలని ఠీవిగా లయబద్ధంగానాట్యం  చేయిస్తున్న శ్రీకారాలలాంటి చెవులు,కంఠాభరణాలు ఎన్ని తగిలించినాఇంకాచాలవని చాటిచెప్తున్నపొడవైన శంఖం లాంటి కంఠం, పూర్ణ కుంభాల లాంటి సమున్నత వక్షోజాలు, ఇసకతిన్నెలలాంటిపిరుదులు, అరటి బోదెలని తలపించే తొడలు పొడవు పుష్టి మాంసలములు అయిన కాళ్లు,మధ్యలో కందిరీగ లాంటి సన్నని నడుము,దాని కేంద్రంలో నూతి లాంటి లోతైన నాభి, ఈ అందాలన్నింటినీ ‘మేని రంగుతో’ పోటీ పడలేక వాటిని దాచలేక దాస్తున్నకంచి పట్టుచీరలో మరుగు పరచుకొని, అతిలోకసుందరి అయిన ‘రమా పద్మజ’ చేత పాల గ్లాసుతో  ఆమె శోభనపు గదిలో అడుగు పెట్టింది!

రతి కేళిలో,ఆమె కుంభ స్తన మర్దనలు,అథరామృతపు గుటకలు,బిగి కౌగిలింతలో  ప్రాణాయామాలు, అంగాంగములతోటి యోగాసనాలు,ముద్దులతో వెలయించే ‘ముద్రలు’, ఆమె గళము నుండి వెలువడిన ‘రతి కూజిత’ శబ్దాల శ్రవణ మననా దులు గుర్తుకి వచ్చి,మరల అవే మధురానుభూతు లని అందించి, అందుకొని పరవశించా లని,తాళితో తనకి  కట్టుబడ్డ,ఆ ‘అందాల బొమ్మతో’ ఆడుకోవాలనే నిర్ణయం అతనికి ఆ క్షణంలో కలిగింది.

కాని ఏం లాభం!! అతను తాను తగిలించుకొన్న,శృంఖలాలని తానే చేధించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు దానికి కారణం, ‘నిశిగంధతో’ పెళ్లి కూడా అదే రోజు జరిగింది గనుక!!

నిశిగంధ అతని సెక్రటరీ! ఆఫీసుకి వెళ్ళగానే పలకరించింది.“ఉదయ్!ఎందుకలా ఉన్నావు,ఏదో పోగొట్టు కొన్న వాడిలాగ?”అని, ఆమె భాస్కర్ని ‘ఉదయ్’ అని పిలుస్తుంది. నిశిగంధ ‘సోగ కనులు’ సూదంటు రాయి లాంటివి, అవి దరి చేరిన ప్రేమికున్ని రెచ్చగొడతాయి! రమ కళ్ళ లాగ, ఆర్ద్రతనీ, ఆప్యాయతనీ వర్షించ లేవు!! నిశి ముక్కు నిటారుగానే ఉన్నా,చివర వంపు తిరిగి మొన తేలి, ప్రియుని గుండెని చీల్చే లాగ ఉంటుంది! రమ నాసిక లాగ, నాజూకు సంపెంగ మొగ్గలాగ ఉండదు! నిశి  పెదవులు ప్లంపీగా, జ్యూసీగా జుర్రుకోవాలనే కోరికలు కలిగిస్తాయి. రమ అధరాల లాగ లేలేత గులాబీ రేకుల్లాగా ఉండవు! రమది గుండ్రని చంద మామ లాంటి ముఖం, నిశిది కోలముఖం ! నిశి సొగసులు, రమ అందాలకి విభిన్నంగా ఉంటాయి! రమ తన పరిష్వంగంలో వెన్నెల జల్లు వర్షిస్తే, నిశిగంధ  కౌగిలిలో సెగలు రేపగల ‘పరిపుష్ట భోగ క్షమాంగి’ !!

“అవును నిశి డార్లింగ్! రమ ‘వెడ్డింగ్’ ఏనివర్సరీని’జరుపుకోవాలని ఆశ పడుతోంది. గత రెండేళ్ళుగా ఆమెని ఆ అకేషన్’ నుంచి దూరంగానే ఉంచాము కదా? ఈ సారి దాని కోరిక తీరిస్తే తప్పేముంది?”

“ముందు దానికి ఏం మాట ఇచ్చావో చెప్పు ఉదయ్ ?”

“పెళ్లి రోజుని భావనాతీతంగా చేసుకొందామని అన్నాను, పొరబడ్డానా డియర్?”

నిశిగంధ కాసేపు ఆలోచించింది.“పొరపాటు జరిగిందా,లేదా అన్నది సమస్య కాదు ఉదయ్! నువ్వు మాట ఇచ్చావు గనుక నేను దానిని తప్పక నిలబెడతాను! పెళ్లి రోజుని భావనాతీతంగానే చేసుకొందాం, మనమందరం కలసి” అంది. భాస్కర్’కి అర్థం కాలేదు,” మనమందరం కలసి అంటే?” అని అడిగాడు.

“చూడు డియర్! నేను తన సవతిని అన్ననిజం, రమకి ఏదో ఒక రోజు తెలియ వలసిందే! దానిని మన ఉమ్మడి పెళ్లిరోజు నాడే డిక్లేర్ చేద్దాం! అప్పుడు అది, భావనాతీతమే అవుతుంది కదా?”భాస్కర్’ స్తబ్ధుడు అయ్యాడు! “నిజమే కాని.. రమ తట్టుకోగలదా?” అని మాత్రం అన్నాడు.

ఆమె నిశ్శబ్దంగా అతని తలని చేతుల లోకి తీసుకొని, తన పెదవులతో నుదుట 

ముద్దు పెట్టి, “టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా అవన్నీచూసుకోవడానికి!” అంది. భాస్కర్ ఆమె క్రింద పెదవిని అందుకోవాలని ప్రయత్నం చేసాడు. నిశి వాటిని దొరకనివ్వ లేదు! అతనికి అర్థమయింది, ఆమె తన అధరాలని అలా అందించదని! వెంటనే ఆమె మెడ వెనుక గాడమైన ముద్దు ముద్ర వేసాడు. తన మునిపళ్ళతో అక్కడ చిన్నగాయం కూడా చేసాడు! నిశికి అలాంటి ముద్దు కావాలి!

మెడ వెనుక గాయం చురుక్కుమని అనిపించగానే నిశి  రియాక్టు అయింది. అతని వైపు తిరిగి ముద్దుకి అనుమతించింది. అతడు ఆమె ప్లంపీ, జ్యూసీ, స్ట్రాబెర్రీలని తన పెదవుల మధ్య ఇరికించాడు. వాటి మధురి మలని కళ్ళు మూసుకొని నెమ్మదిగా ఆస్వాదించ సాగాడు. నిశిగంద కూడా ఆ పనిలో పడింది.

కాసేపు గడిచాక “ఉదయ్! వదులు స్నానం చేసి వస్తాను” అని సైగ చేస్తూ ఆమె అతని నుండి విడివడింది.ఇద్దరూ ఆఫీసు కర్టెన్ వెనకనున్న బెడ్’ మీదకి వెళ్ళారు.

నిశిగంద వెల్’ స్పన్’టవల్’ తీసుకొని స్నానపు గదిలోకి వెళ్లింది. స్నానం ముగించి దానిని శరీరం చుట్టూ కప్పుకొని గుండెల దగ్గర ముడివేసి, ఆమె డ్రెస్సింగ్ టేబిలు ఎదుట కూర్చొంది, తన కేశాలని మీదకి దువ్వి, శిఖి ఫించం లాగ బంధించింది. ఆమె శరీరమే అలంకారం, ఇక ఆభరణాల అవసరం ఏముంది!

భాస్కర్ మరల ఆమె వీపు వెనక నిలబడి అద్దంలో నిశి అందాలని చూడసాగాడు! నిశి గుండెల మీద పెట్టిన టవల్ ముడి విప్పి, క్రిందకి జార్చింది దానితో ఒకదాని

కొకటి ఒరుసుకొంటున్న చక్రవాక మిథునాల వంటి ఉన్నత స్తనాలు స్వేచ్చగా బయట పడ్డాయి! ప్రతిబింబమే ఇంత పసందుగా ఉంటే, వాటి మూలాలు ఎంత గమ్మత్తుగా ఉంటాయో కదా! భాస్కర్’ వాటిని అందుకోవాలని ఆతుర పడ్డాడు. నిశి తువాలుని పూర్తిగా విప్పేసి, పాన్పు మీదకి వెళ్లి, బాహువుల్ని చాపి అతనికి  ఆహ్వానం పలికింది !!                                                                                                       ************                                                                                                                    ‘వనమాలి’ ఒక ‘ప్రొఫెషనల్-ఈవెంట్’ మేనేజరే కాక,అపరాధ పరిశోధకుడు కూడా! రమాపద్మజకి బాబాయి వరుస అవుతాడు. పెళ్లి కాక ముందు రమాపద్మజ నాట్య ప్రదర్శనలు అతని పర్యవేక్షణలో జరిగాయి! అతనికి ఫోను చేసి తన వెడ్డింగ్’ ఏనివ ర్సరీని డిజైన్ చేయమని అడిగింది రమా పద్మజ.

 ‘భాస్కర్’ఎంత విలాస పురుషుడో వనమాలికి తెలుసు! రమతో అతని పాత పెళ్లి రోజులు ఎలా జరిగాయో కూడాతెలుసు! ఇప్పుడు3వ పెళ్లిరోజుని స్పెషల్’గాజరుపు కోవాలని తోచి తనని సహాయం అడగడం అతనికి సంతోషాన్నికలిగించింది .“రమా! ఉహించలేని రీతిలో సెలబ్రేట్ చేయడం నీకే చెల్లుతుంది! ధూమ్ 3లో ‘కత్రినా’చేసిన  ‘కమలి..కమలి..’ అన్నపాటకి ‘కొరియోగ్రఫీ,కాస్ట్యూమ్స్’ డిజైన్ చేయించి మంచి, ప్రొఫెషనల్’చేత ప్రాక్టీసు చేయిస్తాను! దాన్ని మించిన భావనాతీత అనుభవం ఇంకొకటి ఉండదు, ఏమంటావు?” అని అడిగి, ఆమె చేత ఓకే చేయించుకొన్నాడు. ఈ ‘ఈవెంట్’కి, ‘నిషిగంధ ఎప్రోచ్’ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వనమాలి,

 ఆమెని ఫాలో చేసాడు.

నిశిగంధ ఆలోచనలు వేరే విధంగాఉన్నాయి! ఉమ్మడి పెళ్లి రోజు రమకి షాక్’ ఇచ్చి ఆమెని పిచ్చిదాన్ని చేయాలని ప్లాన్ చేసింది. ఆ ప్లాన్లో ఎలాంటి రిస్కు రాకుండా అమలు జరిగేందుకు నిశిగంధ,ఊరి చివర నివసించే ఒక తాంత్రికుని సహాయం అడిగింది. అతను రమ ‘అండర్ గార్మెంట్స్’ జుత్తు’ తీసుకొని రమ్మని అన్నాడు, చేతబడి చేస్తానని ఆమెకి పిచ్చి ఎత్తడం ఖాయమని చెప్పాడు. వాటిని తెచ్చి తన శిష్యునికి అప్ప జెప్పమని అన్నాడు. నిశిగంధ సరేనని వెళ్లింది!

వనమాలికి ఆమె ప్లాన్’ శిష్యుని ద్వారా అర్థమయి, ఆ శిష్యుణ్ణి మంచి చేసుకొ న్నాడు! అంతే కాదు ఆ పరిశోధకుని కళ్ళు, అక్కడ నల్లని జిడ్డు లాంటి పదార్ధం భూమి లోపలి నుండి చెమర్చుతూ  బయటికి  ఉబుకుతున్నట్లు కనిపెట్టాయి! ఆ పదార్ధం ఏమిటని ప్రశ్నించాడు. “అది క్రూడ్ ఆయిల్ దొరా!” అన్నాడు ఆ శిష్యుడు. అతడు చెప్పిన మాటలని బట్టి, వనమాలి గొప్ప ‘రహస్య సమాచారాన్ని’ రాబట్టాడు!!                                          

      ******************                                                                                                                            ఆ రోజు పెళ్లి రోజు!! రమ తన ప్రియాతి ప్రియుడైన ప్రాణ నాదున్ని ఏకాంతంగా మురిపించ డానికి,ఎంచు కొన్ననాట్య ప్రదర్శన కోసం, ‘హోటల్ హయత్’ హైట్స్’లో, ఎ.సి సూట్ బుక్’చేసింది! డాన్స్’ కోసం వేరే దుస్తులు లోపల ధరించి, పైన ఎర్రని

కాశ్మీరు శాలువ కప్పుకొంది. భాస్కర్’ సమయానికే వచ్చాడు, నిశిని వెంట  పెట్టుకొని! ‘ఈయనతొ ఈ సెక్రటరీ దేనికి?’ అనుకొంది రమ!

నిశిగంద, రమాపద్మజతో చేయి కలిపింది. “హాయ్! చెల్లీ! నా పేరు నీకు తెలుసు కదా? నేను భాస్కర్’ ఉదయాద్రి మొదటి భార్యని! నీకన్నా 2 ఏళ్ళు సీనియర్ని! మన  ‘మేరేజ్- డేలు’ ఒకటే కావడం ఆశ్చర్యంగా ఉంది కదూ! గత 2 పెళ్లి రోజులు ఉదయ్’ నాతోనే గడిపాడు! నువ్వు ఇవాళ స్పెషల్’ పెర్ఫార్మెన్స్’కి  తయారుగా ఉన్నావట కదా! చెయ్యి చెల్లీ! నాట్యం చెయ్యి, నేను ఉదయ్’, దానిని చూసి ఆనం దించి ఆమోదించాలని వచ్చాము! అర్థమయిందా!” అంది.         

రమ నివ్వెర పోయింది. ‘ఏమంటోంది ఈ సెక్రటరీ! భాస్కర్ మౌనంగా ఎందుకు ఉన్నాడు?!’ అనుకొంది. “ఏయ్! నీకు పిచ్చి కాని పట్టిందా? ఏం మాట్లాడుతు న్నావు నువ్వు? నువ్వొక సెక్రటరీవి అని గుర్తుకి తెచ్చుకో!” అని గద్దించింది.

“ఉదయ్! రమ నా మాటలు నమ్మడం లేదు, నువ్వైనా చెప్పు!”

“రమా డియర్! నిశి నిజమే చెప్పింది.అమ్మ అంగీకారం లేక, మా పెళ్ళి రహస్యంగా ఉండి పోయింది! అమ్మకి నువ్వు నచ్చడం వల్ల మన పెళ్లి బాహాటంగా జరిగింది! రెండూ ఒకే తేదీన ...”

రమకి ఇంకేమీ వినిపించ లేదు.‘అయిపోయింది! తను కట్టుకొన్నఆశాసౌధం కూలి

పోయింది! ఇంకా తనెందుకు బ్రతికి ఉంది? ఈ భూమి బ్రద్దలయి తనని లోపలి చేర్చుకోదేమి?’అని ఆలోచిస్తూ తూలిపడింది! భాస్కర్ ఆమెని పట్టుకోవాలని ముందుకి వంగాడు, కాని నిశిగంద అతనిని వారించింది.

“చూడు చెల్లీ! రాజీ మార్గానికి వచ్చి, నాతో పాటు ఉదయ్’ని పంచుకో! నేను పెద్ద రాణిని, నువ్వు చిన్నదానివే అయినా పట్టపు రాణీవి! అలా సోఫా మీద కూర్చో, మనం స్థిమితంగా మాట్లాడుకొందాం!”

అప్పుడే అక్కడకి వచ్చిన వనమాలి,రమని పొదివి పట్టుకొన్నాడు.“రమా! నీ భర్త మోసగాడు, నీ పెళ్ళికి ముందు అతను వివాహితుడు అన్న విషయం నాకు ఏ మాత్రం తెలిసినా పెళ్లి  ఆపేవాడిని! ధైర్యాన్ని కోల్పోకుండా ఓపిక పట్టు. నీకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి!”

“ఆగండి బాబాయిగారూ! నిజం నిష్టూరమే అయినా ఆమెని తెలుసుకో నివ్వండి. మీ రమకి ఇప్పుడు 2 ఆప్షన్లు ఉన్నాయి!మొదటిది, రాజీ పడి ఒకే ఇంట్లో, నా తోను ఉదయ్’తోను సఖ్యంగా ఉంటూ, కాపురం చేయడం! రెండవది, ఎలాంటి షరతులు లేకుండా విడాకులకి ఒప్పుకొని, శాశ్వతంగా భాస్కర్కి దూరం కావడం!” అంటూ డైవోర్సు పేపర్లు రమ ముందుకి త్రోసింది నిశిగంద.

రమ ఆ పేపర్ల వంక యథాలాపంగా చూసింది. వాటి పైన భాస్కర్ అప్పటికే సంతకం చేసేసాడు! తన భర్త నిర్ణయం కూడా అదేనని అర్థమయింది! సోఫాలో నిటారుగా కూర్చొని, కన్నీళ్లు తుడుచుకొంది. అప్పటి కప్పుడే ఆమె ఒక నిర్ణయా నికి వచ్చి, సపోర్టు కోసం వనమాలిని చూస్తూ చెప్పింది.

“బాబాయ్! ఇతనితో నేను 3 సంవత్సరాలు వైవాహిక జీవితం గడిపాను! ‘పతి పరమేశ్వరుడు’ అన్న భావంతో అతనికి,  త్రికరణ శుద్ధిగా సమర్పించు కొన్నాను! ఆ సమర్పణలో భాగంగా 3, 4 సార్లు రతి క్రియలోనే, భావ శూన్యతని పొంది నా మెదడు లోని ‘కామ కేంద్రంలో’ లీనమయి, అపూర్వ మైన సుఖానుభూతిని పొందాను! అలాంటి అనుభవాన్ని మరల, మరల ఇతని దగ్గర పొందగలనని ఆశ పడ్డాను! రతి క్రియలో కేవలం ఇంద్రియాలకి చెందినదే అని, నిజమైన అనుభవం ఇంద్రియాలకి అతీతమని తెలిసినా (సంభోగం నుండి సమాధి –ఓషో రజనీష్) దానికి ఇంకా సమయం ఉందిలే! ముందు నా భర్తని సుఖపెట్టనీ! అని సమాధాన పడ్డాను! ఇతనికి ఆ అర్హత లేదని అర్థమయింది, ఇందులో నేను కోల్పోయినది ఏమీ లేదు! పైపెచ్చు గర్భవతిని అయే అదృష్టం దక్కింది! నిశి చెప్పిన 2వ ఆప్షన్’ నాకు అంగీకారమే! కాని ఒకే ఒక షరతు! శిశువు పైన ఎలాంటి అధికారాలు భాస్కర్’కి ఉండకూడదు”అని సంతకం చేసింది.

నిశి గర్వంగా నవ్వి, భాస్కర్ వంక చూసింది. అతనికి రమ చెప్పిన మాటలు ఏవీ అర్థం కాలేదు! “నిశీ! రమ ఏం చెప్పింది? పుట్టబోయే శిశువు పైన అధికారం ఒదులుకోమని, అంతేగా?” అని అడిగాడు.

“అంతే! ఉదయ్! భయపడకు! నీకు సంతానాన్ని నేను కని ఇస్తాను.. నేను కంటాను.. నేను కంటాను..” అంటూ వికటంగా నవ్వ సాగింది నిశిగంద !! అలా నవ్వుతూనే జుట్టుని చిందర వందరగా విప్పేసింది! వేసుకొన్న అనార్కలి డ్రెస్సుని, పీలికలు పీలికలు చేసింది. “నేను కంటాను.. నేను కంటాను..” అంటూ వికృతంగా నవ్వసాగింది! ఆమెకి ఏం జరిగిందో ఎవరికీ అర్థం కాలేదు, అర్థమయినది ఒక్క వనమాలికే! చేతబడి కోసం ‘నిశి  శాంపిల్’ ఇచ్చినది అతనే కదా మరి!

ఆ సమయంలో ఒక పోలీసు ఇనస్పెక్టరు, ఇద్దరు కానిస్టేబుళ్లు , మరొక మహిళా కానిస్టేబిల్’తో సహా ఆ రూము లోపలికి  వచ్చారు.“మిస్టర్ భాస్కర్’ ఉదయాద్రి గారూ! మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాను” అంటూ ఇనస్పెక్టర్ అరదండాలు తీసాడు!

“నన్ను అరెస్టు చేస్తారా? హౌ డేర్ యూ!” అన్నాడు భాస్కర్.

“మీరు హిందూస్తాన్ పెట్రోలియం కంపెనీ, క్రూడ్ ఆయిల్ డెలివరీ సిస్టం టేప్ చేసి, ఆయిల్ దొంగతనం చేసారు! దాని కోసం 36 కిలో మీటర్ల పైపు లైను రహస్యంగా భూమి క్రింద నుండి వేసి, రోజుకి 65000 లీటర్ల క్రూడ్ ఆయిల్తో  మీ పెట్రో కెమికల్ ప్లాంట్’ నడుపుతున్నారు! ఇదుగో మీ పైన అరెస్టు వారెంటు !”

ఆ పెళ్లి రోజున, రమాపద్మజ, ‘భావనాతీత గమ్యం’ వైపు గంభీరంగా అడుగులు వేసింది! నిశిగంధ పిచ్చిపట్టి ఆస్పత్రిలో ‘భావనా వికృతమైన జీవితానికి’ అడ్మిట్’ అయింది!! భాస్కర్ చెరశాలలో భావనాతీతంగా  జరుపుకొన్నాడు!!!

<<< >>>

మధుర వాణి , త్రైమాసిక పత్రిక కథల పోటీకి --- ఒక కథా మధురం.

పేరు “భావనాతీత గమ్యము’

రచన: A .శ్రీధర్. చిరునామా: A. శ్రీధర్. P3 –03; Moraj River Side Park.

(village) TAKKA; (Post) PANVEL; (District) Raigad; Maharashtra. (pin) 420206

Blog: Sridhar-ayala blogspot.com  “క్షీర గంగ “

హామీ : ఈ కథానిక నా స్వకపోల కల్పిత రచన. ఇంతవరకు ఏ పత్రికా పరిశీలనలోనూ లేదు . నా స్వంత బ్ల్ల్గులో కూడా ప్రచురించలేదు. ఇది అముద్రితం!!

నా గురించి : నా పూర్తిపేరు అయలసోమయాజుల శ్రీధర్. వయసు 70. రిటైర్డ్’ వైస్’ప్రిన్సిపాల్. రైల్వే టెక్నికల్’ సెంటర్’ బిలాస్’పూరు. దక్షిణ మధ్య రైల్వే. 

నా నవలలు స్వాతిలో (రశన ) ఇరవై ఐదువేలు బహుమతి పొందింది.2012 లో!

మరికటి స్వాతి అనుబంధ నవలగా “పడగ మీద మణి” పడింది 2012 లో!

“సముద్ర తురగం –ఆంధ్ర భూమి దిన పత్రికలో డైలీ సీరియల్’గా పడింది.2014లో

నా నాటిక “చీకటి చకోరాలు “ కీశే. పుచ్చలపల్లి సుందరయ్య అవార్డు గెలుచుకొంది.    

***************************